ప్రేయసి కోసం సాగర తీరంలో.. | Boy crafts ‘love coastline’ for girlfriend | Sakshi
Sakshi News home page

ప్రేయసి కోసం సాగర తీరంలో..

Published Thu, Jun 2 2016 12:45 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

ప్రేయసి కోసం సాగర తీరంలో.. - Sakshi

బీజింగ్: చైనాలో ఓ యువకుడు తన ప్రేయసికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చాడు. చైనాలో మే 20 వ తేదీని అక్కడి యువత అనధికారికంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. 520 అనేది మాండరిన్లో 'ఐ లవ్ యూ' ను సూచిస్తుంది కాబట్టి వారికి ఆరోజు ప్రత్యేకమన్నమాట.

ఆ రోజు తన ప్రేయసితో పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకున్న పేరు వెల్లడించని ఓ ప్రేమికుడు సముద్రతీరంలో ఆమె ఫోటోలతో పెద్ద హారం కట్టేశాడు. నాలుగేళ్ల క్రితం ఆమె తనకు పరిచయమైన దగ్గరి నుంచి తీసిన ఫోటోలు సుమారు వెయ్యికి పైగా ప్రింట్ వేయించి సముద్ర తీరంలో ప్రదర్శనలా ఉంచాడు. దీంతో అతగాడి ప్రేమకు ముగ్ధురాలైపోయింది సదరు ప్రియురాలు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచగా 'గొప్ప ప్రేమికుడే' అంటూ మెచ్చుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement