బుకర్‌ ప్రైజ్‌’కు మ్యాన్‌ గ్రూప్‌ గుడ్‌బై

Booker prize trustees search for new sponsor after Man Group exit - Sakshi

లండన్‌: ఆంగ్ల నవలారంగంలో బ్రిటన్‌ అందించే అత్యున్నత పురస్కారం ‘మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌’ పేరు మారనుంది. బుకర్‌ ప్రైజ్‌కు 18 ఏళ్లుగా స్పాన్సర్‌ కొనసాగుతున్న హెడ్జ్‌ సంస్థ ‘మ్యాన్‌ గ్రూప్‌’ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. అత్యుత్తమ ఆంగ్ల నవలలకు ఏటా ఈ అవార్డు కింద 50వేల బ్రిటిష్‌ పౌండ్లు(రూ.46.79 లక్షలు) బహుమతిగా అందజేస్తున్నారు. బ్రిటన్‌ రచయిత సెబాస్టియన్‌ ఫాల్క్స్‌ గతేడాది మ్యాన్‌ గ్రూప్‌ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్‌వెల్త్‌ దేశాల రచయితలకే పరిమితమైన ఈ అవార్డును 2014లో మిగిలిన దేశాలకు విస్తరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పాన్సర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవా లని  నిర్ణయించింది. దీనివల్ల ఏటా రూ.14.97 కోట్ల ఆర్థిక సాయాన్ని బుకర్‌ సంస్థ కోల్పోనుంది. 1969 నుంచి 2002 వరకూ బుకర్‌ అవార్డుకు మెక్‌కెన్నెల్‌ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పట్లో 21 వేల పౌండ్లుగా ఉన్న బహుమతిని 2002లో మ్యాన్‌ గ్రూప్‌ 50 వేల పౌండ్లకు పెంచింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top