అచ్చం తండ్రి పోలికే! | blue-eyed girl remind you of anyone? Princess Charlotte looks just like her father in new photos | Sakshi
Sakshi News home page

అచ్చం తండ్రి పోలికే!

Nov 30 2015 3:46 PM | Updated on Sep 3 2017 1:16 PM

అచ్చం తండ్రి పోలికే!

అచ్చం తండ్రి పోలికే!

గాలికి తేలియాడే నల్లని శిరోజాలు, నక్షత్రాలను కనురెప్పల చాటు దాచుకున్నట్టు మెరిసిపోయే నీలివర్ణపు కళ్లు.. బుజ్జీ యువరాణి చార్లెట్‌ను చూసి బ్రిటన్ వాసులు మురిసిపోతున్నారు.

గాలికి తేలియాడే నల్లని శిరోజాలు, నక్షత్రాలను కనురెప్పల చాటు దాచుకున్నట్టు మెరిసిపోయే నీలివర్ణపు కళ్లు.. బుజ్జీ యువరాణి చార్లెట్‌ను చూసి బ్రిటన్ వాసులు మురిసిపోతున్నారు. నల్లని వెంట్రుకలు తల్లి నుంచి పుణికిపుచ్చుకున్నవే అయినా.. చార్లెట్‌ నీలివర్ణపు కనుపాపలు మాత్రం తండ్రివేనని పోలికలు చూస్తున్నారు. తండ్రి, కూతుళ్ల ఫొటోలు పక్కపక్కనే పెట్టి చార్లెట్‌ అచ్చం తండ్రి విలియమ్స్ పోలికేనని బ్రిటన్ వాసులు మురిసిపోతున్నారు.

బ్రిటన్ రాజవంశ దంపతులు కేట్ మిడిల్టన్‌, ప్రిన్స్ విలియమ్‌ ఆరునెలల ముద్దుల కూతురు చార్లెట్‌. తమ అభిమానులకు ఆనందం పంచేందుకు చార్లెట్‌ రెండు ఫొటోలను విలియమ్స్ దంపతులు ఆదివారం విడుదల చేశారు. ఫొటోగ్రాఫర్ అయిన కేట్‌ స్వయంగా ఈ ఫొటోలను క్లిక్‌ అనిపించింది. బ్రిటన్ రాజవంశ సిహాసనం అధిష్టించబోయే నాలుగోతరం యువరాణి చార్లెట్‌. కేట్‌, విలియమ్స్ దంపతులకు ఆమె రెండో సంతానం. వారికి జార్జ్‌ అనే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కేట్‌ గతంలో తన ఇద్దరు పిల్లలైన రెండేళ్ల ప్రిన్స్ జార్జ్‌, చార్లెట్ ఫొటోలను తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement