కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి | At least 61 killed and dozens injured in Kabul blast | Sakshi
Sakshi News home page

కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి

Jul 23 2016 4:25 PM | Updated on Sep 4 2017 5:54 AM

కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి

కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో  61మంది దుర్మరణం చెందగా, 200మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం కాబూల్లోని దహ్మజంగ్‌  సర్కిల్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.

కాగా వందల మంది షియా ముస్లింలు ఓ చోట చేరి నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతంలో బాంబులు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు సూసైడ్ బాంబర్స్ పేల్చుకున్నట్లు తెలిపారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement