మీరు నా మిత్రులేనా..! | Are You Really My Friend | Sakshi
Sakshi News home page

మీరు నా మిత్రులేనా..!

Jun 18 2017 2:16 AM | Updated on Jul 26 2018 5:23 PM

మీరు నా మిత్రులేనా..! - Sakshi

మీరు నా మిత్రులేనా..!

ఎప్పుడైనా మీ ఫేస్‌బుక్‌ స్నేహితుల జాబితాను ఒకసారి గమనించారా? అందులో ఎంతమంది మీకు తెలిసిన మిత్రులు ఉన్నారు?

ఎప్పుడైనా మీ ఫేస్‌బుక్‌ స్నేహితుల జాబితాను ఒకసారి గమనించారా? అందులో ఎంతమంది మీకు తెలిసిన మిత్రులు ఉన్నారు? సరిగ్గా ఇదే ఆలోచన తంజా హాలాండర్‌ అనే ఆర్టిస్ట్‌కు వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో భాగంగా తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లోని 623 మందిని కలవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘ఆర్‌ యూ రియల్లీ మై ఫ్రెండ్‌’ అనే పేరు పెట్టుకుని వీరందరినీ కలిసే పనిలో ముందుకెళ్లింది. 2010, జనవరి 1న న్యూ ఇయర్‌ రోజున యాత్ర ప్రారంభించింది.

ఒక్కొక్కరినీ కలుస్తూ... వారితో సరదాగా ఫొటోలు తీసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ వచ్చింది. అలా సగటున నెలలో రెండు వారాలు తన ప్రయాణానికి విరామమిస్తూ మొత్తం తన ఫేస్‌బుక్‌ మిత్రులందరినీ కలిసింది. 2016లో తన సుదీర్ఘ యాత్రకు ముగింపు పలికింది. ఈ పరిణామ క్రమంలో ఆమె నాలుగు ఖండాలు, 12 దేశాలు, 43 అమెరికా రాష్ట్రాలు తిరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement