స్మార్ట్ ఫోన్ యాప్స్తో జర జాగ్రత్త! | Apps that you download can leak personal information | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్ యాప్స్తో జర జాగ్రత్త!

Dec 4 2015 5:33 PM | Updated on Aug 18 2018 4:44 PM

స్మార్ట్ ఫోన్ యాప్స్తో జర జాగ్రత్త! - Sakshi

స్మార్ట్ ఫోన్ యాప్స్తో జర జాగ్రత్త!

నిద్ర లేవడంతోనే స్మార్ట్ ఫోన్లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ మెస్సేజ్లకు రిప్లై ఇవ్వటం.. యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్, మొదలైన పనులు చేస్తుంటాం.

న్యూయార్క్: నిద్ర లేవడంతోనే స్మార్ట్ ఫోన్లో ఆప్డేట్స్ చూసుకోవడం.. ఫ్రెండ్స్ మెస్సేజ్లకు రిప్లై ఇవ్వటం.. యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్, మొదలైన పనులు చేస్తుంటాం. కానీ, మీరు వాడే యాప్స్ యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తున్నాయా లేదా అని ఎప్పుడూ ఆలోచించరు. తాజా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాడే యాప్స్లో 9 శాతం యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయని తేలింది. కొన్ని యాప్స్ క్రియేటర్స్ తమ స్వలాభం కోసం యాడ్స్, ఏదైనా ఇతర పద్దతుల్లో ప్లే స్టోర్స్లో రిజిస్ట్రర్ అవుతారు. వినోదం, తమ అవసరాల కోసం కొన్ని కండీషన్లు ఉన్నప్పటికీ యూజర్స్ ఈ విషయాలేవీ పట్టించుకోకుండా యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని తెగ వాడేస్తుంటారని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మిచాలిస్ ఫలోటస్ వివరించారు.

13,500 రకాల ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్పై అధ్యయనం చేసి ఈ వివరాలు తెలిపారు. 2.5 లక్షల యూఆర్ఎల్స్ నుంచి ఈ యాప్స్ యాక్సెస్ చేసుకుంటున్నారని వీటీలో కొన్ని మాత్రమే సరైనవని ఆండ్రాయిడ్ యూఆర్ఎస్ రిస్క్ యాక్సెసర్ గ్రూప్ తమ అధ్యాయనంలో తేల్చింది. డిసెంబర్ 8న జరగనున్న ఐఈఈఈ గ్లోబ్కామ్ కాన్ఫరెన్స్లో తాము కనుగొన్న విషయాలను అక్కడ చర్చిస్తామని ప్రొఫెసర్ వివరించారు. పాపులర్ రేటింగ్ సిస్టమ్ 'వెబ్ ఆఫ్ ట్రస్ట్' యూజర్స్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందు వాటికి కాస్త ప్రైవసీ కల్పించే యోచనలో ఉందని పేర్కొన్నారు. ఆప్లికేషన్లను వాడే ముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాటిని యాక్సెస్ చేయవద్దని స్మార్ట్ ఫోన్ యూజర్లకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement