మార్కెట్‌లోకి మరో కొత్త గేమ్‌ | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి మరో వీడియో గేమ్‌

Published Tue, Feb 12 2019 8:57 AM

Apex Legends Racks Up 25 Million Players One Week - Sakshi

న్యూయార్క్‌: పబ్‌ జీ.. ఈ వీడియోగేమ్‌ ఎంతగా సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఇంకా దాని జోరు తగ్గనేలేదు.. మరో కొత్త గేమ్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు అపెక్స్‌ లెజెండ్స్‌. అమెరికాకు చెందిన వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్‌ స్టూడియో రెస్పాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ గేమ్‌ను రూపొందించింది. ఇది ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌ (ఈఏ) అనుబంధ సంస్థ. గేమ్‌ మార్కెట్‌లోకి వచ్చిన మూడు రోజుల్లోనే కోటి మంది ప్లేయర్లను ఆకట్టుకుంది.

అపెక్స్‌ లెజెండ్స్‌ ప్లేయర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లకు పైగా దాటింది. అంటే దాదాపు 10 లక్షల మంది ఒకేసారి గేమ్‌లోకి లాగిన్‌ అవుతున్నారని ఈఏ తెలిపింది. శుక్రవారం నాటి కల్లా చూస్తే లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ ట్విచ్‌లో ఎక్కువ మంది వీక్షించిన గేమ్‌ ఇదే. అపెక్స్‌ గేమ్‌ను కేవలం ఎక్స్‌బాక్స్, పీఎస్‌4, పీసీల్లోనే ఆడుకోవచ్చు. దీన్ని మొబైల్‌ వెర్షన్‌ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకావముందని చెబుతున్నారు. 
 

Advertisement
Advertisement