మొసలికి చిప్‌..

American Crocodiles Thriving Outside Florida Nuclear Plant - Sakshi

ఇక్కడ కనిపిస్తున్నవి ఓ బకెట్లో ఉంచిన చిన్న చిన్న మొసలి పిల్లలు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం హోంస్టెడ్‌లో ఉన్న అణు విద్యుత్‌ కేంద్రం వద్ద మొసళ్లు చాలా ఉంటాయి. ఈ అణువిద్యుత్‌ కేంద్రానికి సంబంధించిన 168 మైళ్ల పొడవైన కాలువల్లో ఇవన్నీ పెరుగుతుంటాయి. వీటి ఎదుగుదలను గమనించేందుకు, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా నిపుణులు ఉన్నారు. చిన్న మొసళ్ల శరీరంలో ఓ చిప్‌ను అమర్చి, మళ్లీ వాటిని నీళ్లలో వదిలేసి, వాటి ఆరోగ్య వివరాలను ఆ చిప్‌ ద్వారా తెలుసుకుంటుంటారు. పర్యావరణ మార్పులు, వేటగాళ్ల బారి నుంచి మొసళ్లను కాపాడేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top