మగవారికి మద్యం మంచిదే !

Alcohol Taking In Moderate Is Increase Fertility In Men - Sakshi

రోమ్‌ : పురుషులు తగిన మోతాదులో మద్యం తీసుకోవటం వల్ల వీర్యోత్పత్తి మెరుగ్గా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వీర్యోత్పత్తి, వీర్యకణాల సంఖ్యను మద్యం ప్రోత్సహిస్తుందని తేలింది. 323మంది రోగులపై జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మద్యం తాగని వారిలో కంటే.. వారానికి 4-7యూనిట్ల మద్యం తీసుకున్న వారిలో వీర్యోత్పత్తి బాగా ఉన్నట్లు గుర్తించారు. ఇటలీకి చెందిన పోలీక్లినికో ఆస్పత్రి వైద్యుడు ‘‘ఎలెనా రిచి’’ మాట్లాడుతూ.. చిన్న చిన్న మోతాదుల్లో మద్యం సేవించేవారిలో వీర్యోత్పత్తి చక్కగా ఉంటుందన్నారు. అతిగా మద్యం సేవించటం వల్ల అది విషంగా మారుతుందన్నారు. మద్యం ఎక్కువగా సేవించే మగవారిలో వీర్యోత్పత్తి క్షీణించటమే కాకుండా వ్యంధత్వం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top