కెనడాలో పాదచారులపై దూసుకెళ్లిన ట్రక్కు

9 dead after van hits pedestrians in Toronto, driver in custody - Sakshi

టొరంటో: కెనడాలోని సెంట్రల్‌ టొరంటోలో ఓ తెలుపు రంగు ట్రక్కు సోమవారం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడన్నారు.

చివరికి ట్రక్కుతో పారిపోతున్న నిందితుడ్ని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడి సబ్‌వే ను మూసివేసిన పోలీసులు.. ఘటనాస్థలికి రావొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top