9/11 దాడులు : నేటికి 16 ఏళ్లు | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 11.. ఈ పేరు వింటేనే ...

Published Mon, Sep 11 2017 4:15 PM

9/11 from inside the Pentagon



ఉగ్రవాదుల విమానం పెంటగాన్‌ను ఢీ కొట్టిన వెంటనే ఆగిపోయిన గడియారం.

న్యూయార్క్‌ : సెప్టెంబర్‌ 11.. ఈ పేరు వింటేనే అమెరికా ఉలిక్కి పడేంతలా భయపెట్టిన రోజు. ఏక ధృవ ప్రపంచాధినేతగా ఉన్న అమెరికాను.. ఆల్‌ ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ వణికించిన రోజు.  ప్రపంచవ్యాపార సామ్యాజ్య సౌధాలను కూల్చి.. అమెరికా రక్షణ సౌధం పెంటగాన్‌ను పేల్చే ప్రయత్నం చేసిన రోజు.

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కూలిన ఘటనలో దాదాపు 3 వేల మంది మరణించగా.. మరో 60 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. జంట శిఖరాలను కూల్చిన సమయంలోనే పెంటగాన్‌ను ఉగ్రవాదులు నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు. ట్వన్‌ టవర్స్‌ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా.. పెంటగాన్‌ దాడికి సంబంధించిన ఛాయాచిత్రాలను ఇప్పటివరకూ అమెరికా విడుదల చేయలేదు. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన ఆనాటి ఫొటోలను అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది.  


పెంటగాన్‌లో తగలబడిపోయిన కేబుల్స్‌, టెలిఫోన్‌

పెంటగాన్‌లో తగలబడిపోయిన కేబుల్స్‌, టెలిఫోన్‌

దుర్ఘటన గురించి అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్‌కు వివరిస్తున్న ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ

విమానం పేలిపోవడంతో మంటలు లేచి పూర్తిగా నాశనమైన పెంటగాన్‌ లోపలి ప్రాంతం

విమానం పేలిపోవడంతో మంటలు లేచి పూర్తిగా నాశనమైన పెంటగాన్‌ లోపలి ప్రాంతం

 పెంటగాన్‌ను ఢీకొట్టిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన శకలాలు

 పెంటగాన్‌ను ఢీకొట్టిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన శకలాలు

దాడి జరిగిన అనంతరం పెంటగాన్‌ ప్రాంతం

ఎయిర్‌ఫోర్స్‌ ఒన్‌ విమానం నుంచి పరిస్థితిని తెలుసుకుంటున్న నాటి అధ్యక్షుడు జార్జి బుష్‌

 

Advertisement
Advertisement