ఒకేరోజు రెండు వేర్వేరు ప్రదేశాల్లో కంపించిన భూమి

6.5 Strong Earthquake Strikes Indonesia Seram Island - Sakshi

జకర్తా: నిత్యం ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ఇండోనేసియాలో గురువారం భారీ భూకంపం సంభవించింది. ఇండోనేసియా తూర్పు ప్రొవిన్స్‌ మలకులోని సెరామ్‌ ద్వీపంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదయ్యింది. అలానే అంబోన్‌, కైరాతు పట్టణాల్లో కూడా గురువారం ఉదయం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అంబోన్‌ పట్టణంలోని ఓ యూనివర్సిటీ బిల్డింగ్‌కు చిన్న క్రాక్‌ ఏర్పడినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. అంతేకాక అదే ప్రాంతంలో ఉన్న ఓ ఇస్లామిక్‌ పాఠశాలలో కుర్చీలు, ప్లాస్టర్‌, రాళ్లు చెల్లా చెదురుగా పడి ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. సునామీ వచ్చే అవకాశం కూడా లేదని అధికారులు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top