అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం | 6 members of a family charred to death in Lahore | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం

Jan 14 2016 5:11 PM | Updated on Sep 5 2018 9:45 PM

అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం - Sakshi

అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం

పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో గురువారం విషాదం చోటు చేసుకుంది.

లాహోర్ : పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమైయ్యారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి...  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఘటన స్థలం ఇరుకు ప్రాంతంలో ఉండటంతో ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేపోయారు.

దీంతో కొద్ది దూరం నుంచి అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలార్పివేశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నాలుగేళ్ల బాబు కూడా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  అలాగే నలుగురిని రక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement