టైమ్స్‌ మాగజైన్‌ ‘హెల్త్‌ కేర్‌-50’లో ముగ్గురు మనోళ్లే!

3 Indian American In The List Times Magazine 2018 Health Care 50 - Sakshi

ఆరోగ్య రంగంలో అత్యధికంగా ప్రభావితం చేసినందుకు గౌరవం

దివ్యానాగ్, డాక్టర్‌ రాజ్‌ పంజాబీ, అతుల్‌ గవాండేలకు హెల్త్‌ కేర్‌-50 లో చోటు

టైమ్స్‌ మాగజైన్‌ 2018 ఏడాదికి గాను అమెరికాలో ఆరోగ్య రంగాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ప్రతిభావంతుల జాబితాలో ముగ్గురు భారతీయ సంతతికి చెందినవారికి చోటు దక్కింది. అమెరికాలో ఆరోగ్యరక్షణకు కృషిచేసిన  దివ్యానాగ్, డాక్టర్‌ రాజ్‌ పంజాబీ, అతుల్‌ గవాండేలకు ఈ గౌరవం దక్కింది.

ప్రజారోగ్యం, వైద్యం, టెక్నాలజీ, ధర అనే నాలుగు విభాగాల్లో వీరిని ఎంపిక చేస్తారు. టైమ్స్‌ మాగజైన్‌ హెల్త్‌ ఎడిటర్లు, రిపోర్టర్లు అమెరికాలో ఆరోగ్యపరిరక్షణకు చేసిన సేవలను బట్టి వీరిని నామినేట్‌ చేస్తారు. ఆరోగ్యపరిరక్షణకు ఎనలేని కృషి చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ రంగాల్లోని వారిని ఈ జాబితాలో చేర్చుతారు.
 
దివ్యానాగ్‌ 
ప్రతిష్టాత్మక యాపిల్‌ కంపెనీలో హెల్త్‌కేర్‌లో ప్రత్యేక ప్రాజెక్టు చేస్తున్నారు. ఇటు డాక్టర్లకూ, అటు పేషెంట్లకూ రోగి సమాచారాన్ని, వివరాలనూ అందించే యాప్‌ను రూపొందించారు. ఇది వైద్య రంగంలోనే ఓ అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. వాచ్‌ని ధరించిన వారు స్పందిచకపోయినా, హృదయస్పందనని పర్యవేక్షించే  ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ఆరోగ్యరంగంలో ఓ సంచలనం. 

రాజ్‌ పంజాబీ...
ఆరోగ్యసేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆరోగ్యకార్యకర్తలకి శిక్షణనిచ్చే గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకుగాను లాస్ట్‌మైల్‌ హెల్త్‌ సహ వ్యవస్థాపకులు లైబీరియా నుంచి అమెరికాకి శరణార్థిగా వచ్చిన హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ రాజ్‌పంజాబీకి కూడా టాప్‌ 50 జాబితాలో చోటు దక్కింది. 2014 నుంచి 2016 వరకు ఎబోలాను తరిమికొట్టడంలో లాస్ట్‌మైల్‌ సంస్థ ఎనలేని కృషి చేసింది. రాజ్‌ పంజాబీ నేతృత్వంలోని ఈ సంస్థ రిమోట్‌ ఏరియాలో పనిచేసే ఆరోగ్యకార్యకర్తలకు వీడియో, ఆడియోల్లో సందేశాలను పంపేలా ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కమ్యూనిటీ హెల్త్‌ ఎకాడమీనీ ఏర్పాటు చేయడం ఎంత వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. 

అతుల్‌ గవాండే...
అమేజాన్, బెర్క్‌షైర్‌ హాత్‌వే, జేపీ మోర్గాన్‌ లాంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసే దాదాపు ఒక కోటి మంది ఉద్యోగులకు ఉచితంగా సేవలందించే ఆరోగ్యపరిరక్షణా కార్యక్రమాన్ని అతుల్‌ గవాండే ప్రవేశపెట్టినందుకుగాను గవాండేని టాప్‌ 50 జాబితాలో చేర్చి గౌరవించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top