ఇలా కూడా శిక్షిస్తారా..? దారుణం  | 145-kg woman sits on minor, causes death  | Sakshi
Sakshi News home page

ఇలా కూడా శిక్షిస్తారా..? దారుణం 

Oct 18 2017 11:13 AM | Updated on Oct 17 2018 4:54 PM

145-kg woman sits on minor, causes death  - Sakshi

నిందితురాలు వేరోనిక పోసీ

న్యూయార్క్‌: ఓ చిన్నారి సత్ప్రవర్తన కలిగిలేదని ఓ మహిళ దారుణ శిక్ష విధించింది. ఆ శిక్ష కాస్త ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వేరోనిక పోసీ(64) అనే మహిళ హత్య ఆరోపణ కేసు ఎదుర్కొంటుంది. అయితే ఈ హత్య దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయం వెల్లడైంది. 145 కిలోల బరువున్నవేరోనిక  కజిన్‌ 9 ఏళ్ల డెరికా లిండ్సే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించదనే ఆగ్రహాంతో ఆమెపై కూర్చోంది. దీంతో ఆ చిన్నారి ఊపిరి ఆడక మరణించింది.

ఆ చిన్నారి మూడు ఫీట్ల ఎత్తుతో 33 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆచిన్నారి బరువు నిందుతిరాలి బరువుకన్నా 4 రెట్లు ఎక్కువని, ఈఘటన గత శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ.,. తన కూతురు అమర్యాధకంగా ప్రవర్తించడంతో మా కోడలైన వేరొనికాను పిలిచాని తెలిపింది. అయితే వేరొనికాకు ఎన్నేళ్లు శిక్ష పడే అవకాశం ఉందనే విషయం తెలియలేదు.

Advertisement
 
Advertisement
Advertisement