
'నోటి దురద.. తీరిన సరదా'
ఓ విద్యార్థి సరదాకు అన్న మాట అతడిని జైలు పాలు చేసింది. మూడు రోజులపాటు అతడికి జైలు గోడలు ఎలా ఉంటాయో చూపించింది. ఈ ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది.
న్యూయార్క్: ఓ విద్యార్థి సరదాకు అన్న మాట అతడిని జైలు పాలు చేసింది. మూడు రోజులపాటు అతడికి జైలు గోడలు ఎలా ఉంటాయో చూపించింది. ఈ ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. టెక్సాస్ లో అర్మాన్ సింగ్ సరాయ్ అనే పన్నేండేళ్ల బాలుడు తాను చదువుతున్న నికోలస్ జూనియర్ హైస్కూల్ లో ఓ క్లాస్ మేట్ తో తన బ్యాగులో బాంబు ఉందని అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా ప్రశ్నించకుండా నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఆ పిల్లాడు చేసిన అల్లరిపనికి పోలీసులు మూడు రోజులపాటు జైలులో ఉంచి వదిలివేశారు. ఈ విషయాన్ని అతడి సోదరి ఫేస్ బుక్ ద్వారా పంచుకోగా చాలామంది షేర్ చేసుకున్నారు. వాస్తవానికి ఆర్మాన్ తల్లిదండ్రులకు అతడి అరెస్టు గురించి తెలియదు. ఆరోజు స్కూల్ నుంచి ఇంకా రాలేదేంటి అని కంగారు పడిపోయి పోలీసులకు ఫిర్యాదుచేయగా అతడిని అరెస్టు చేసి జువెనైల్ అధికారులు సమక్షంలో ఉంచినట్లు తెలిపారు. ముందునుంచే అర్మాన్ కాస్తంత అల్లరిగా ఉండే పిల్లవాడు కావడంతో అతడిని అదుపుచేయడంలో విఫలమయ్యేవారు.