చైనాలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 10 మంది మృతి
Mar 3 2017 9:48 AM | Updated on Aug 30 2018 4:10 PM
బీజింగ్: చైనాలో గురువారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యునాక్సియన్ కౌంటీ సమీపంలోని హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. అర్దరాత్రి 11 గంటల సమయంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు , 47 మంది ప్రయాణీకులు గల బస్సును ఢీ కొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే తొమ్మిది మంది మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో వ్యక్తి మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement