'ఏసీటీ'తో యప్టీవీ ఒప్పందం | YuppTV & ACT Fibernet partner to delight their Hyderabad users” | Sakshi
Sakshi News home page

'ఏసీటీ'తో యప్టీవీ ఒప్పందం

May 26 2016 12:56 PM | Updated on Sep 4 2018 5:21 PM

ప్రపంచంలోనే ప్రముఖ ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్రొవైడర్ యప్టీవీ.. భారత దేశపు నాల్గవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ(అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రముఖ ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్రొవైడర్ యప్టీవీ.. భారత దేశపు నాల్గవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ(అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ సేవలను వినియోగించుకుంటున్న వారు యాడ్ ఆన్ ప్యాకేజీ కింద కేవలం నెలకు రూ 99 చెల్లించి యప్టీవీలో అందుబాటులో ఉండే 200లకు పైగా లైవ్ టీవీ చానల్స్, రెండు వేలకు పైగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు, టీవీ షోలు లాంటి విభిన్న కార్యక్రమాలను వీక్షించే అవకాశం హైదరాబాద్ వాసులకు కలుగుతోంది. హైదరాబాద్లో ఏసీటీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సేవలను వినియోగించుకునే వారికి మనోరంజకమైన యప్టీవీ కార్యక్రమాలు ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ సందర్భంగా యప్టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించడానికి హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ కావాలని.. ఏసీటీతో ఒప్పందం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సర్వీస్ అందుతుందన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ ఈ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement