
ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం టవర్ కంపెనీలలో ఒకటైన ఇండస్ టవర్స్, గ్లాస్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ (GFRP)పై పరిశోధన చేయడానికి ఐఐటీ మద్రాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఉక్కుకు స్థిరమైన, మన్నికైన.. ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయనున్నారు.
ఈ భాగస్వామ్యంలో ఐఐటీ మద్రాస్ మెకానికల్ స్ట్రెంత్, మన్నిక, లైఫ్ సైకిల్ వంటి వాటిని అధ్యనయం చేస్తుంది. అంతే కాకుండా టెలికాం, ఇతర పరిశ్రమల కోసం డిజైన్.. భద్రతా ప్రమాణాలను సృష్టిస్తుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో అనిల్ గుప్తా (ఇండస్ టవర్స్), ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు రవీంద్ర గెట్టు, అశ్విన్ మహాలింగం పాల్గొన్నారు.