బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి | YSRCP Leaders celebrate Babu Jagjivan Ram jayanthi at party office | Sakshi
Sakshi News home page

బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

Apr 6 2017 2:22 AM | Updated on Jul 25 2018 4:42 PM

బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి - Sakshi

బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళుల ర్పించారు. జగన్‌ నివాసంలో బుధవారం జగ్జీవన్‌రామ్‌ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి వైఎస్‌ జగన్‌ పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సాగి దుర్గా ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలు మొండితోక అరుణ్‌కుమార్, వరుదు కల్యాణి, డా.హరికృష్ణ, నాగదేశి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement