‘స్విస్ ఛాలెంజ్ కాదు..సూట్కేస్ ఛాలెంజ్’ | YSRCP Leader Bhumana Karunakar Reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘స్విస్ ఛాలెంజ్ కాదు..సూట్కేస్ ఛాలెంజ్’

Sep 12 2016 1:53 PM | Updated on Aug 31 2018 8:31 PM

‘స్విస్ ఛాలెంజ్ కాదు..సూట్కేస్ ఛాలెంజ్’ - Sakshi

‘స్విస్ ఛాలెంజ్ కాదు..సూట్కేస్ ఛాలెంజ్’

చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కోర్టు ఆధ్వర్యంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యముంటే కోర్టు ఆధ్వర్యంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం ముసుగులో రూ.వేలకోట్ల అవినీతికి చంద్రబాబు తెర లేపారన్నారు. అది స్విస్ ఛాలెంజ్ కాదని, సూట్కేసు ఛాలెంజ్ అంటూ భూమన ఎద్దేవా చేశారు.

రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే నిర్మాణం విషయంలో ప్రభుత్వ వైఖరి సరిగా లేదన్నారు. చంద్రబాబు అవినీతిని అడ్డుకుంటామని భూమన తెలిపారు. కాగా  ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై  హైకోర్టు ఇవాళ స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement