ప్రేమ పేరుతో యువతిని నమ్మించి.. | youth cheats lover | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో యువతిని నమ్మించి..

Apr 2 2016 9:23 AM | Updated on Sep 3 2017 9:05 PM

ప్రేమ పేరుతో యువతిని బుట్టలో వేసుకొని.. పెళ్లి నిశ్చితార్థం కూడా చేసుకొని, ఆ తర్వాత ముఖం చాటేశాడో యువకుడు.

నాగోలు: ప్రేమ పేరుతో యువతిని బుట్టలో వేసుకొని.. పెళ్లి నిశ్చితార్థం కూడా చేసుకొని,  ఆ తర్వాత ముఖం చాటేశాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు లైంగిక దాడి, చీటింగ్ కేసులు నమోదు చేశారు.  ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం...  సైదాబాద్ కాలనీకి చెందిన శివ ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాల లో బీడీఎస్ చదువుతున్నాడు. ఎల్బీనగర్‌కు చెందిన యువతి (28) వైద్యురాలు. వీరిద్దరికీ  2004లో పరిచయమైంది. 

ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన అవసరాల నిమిత్తం యువతి నుంచి పలుమార్లు డబ్బు తీసుకున్నా డు.  ఇరుకుటుంబాల వారు వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని 2016 ఫిబ్రవరి 14న నిశ్చితార్థం చేశారు.  బంగారం, నగదును ఇరు కుటుంబాల వారు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈనెల 22న పెళ్లి జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. శివ తన చదువు కోసం యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.4.5 లక్షల నగదును తీసుకున్నాడు. తదనంతరం పెళ్లి చేసుకొమ్మని అడుగగా శివ తాను పెళ్లి చేసుకోనంటూ ముఖం చాటేశాడు. దీంతో యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా... శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివపై లైంగిక దాడి, నమ్మకద్రోహంతో పాటు పలు సెక్షన్ల కిం ద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement