 
															వనితకు వేదనే..!
స్త్రీని దైవంగా కొలిచే మన దేశంలో మహిళలకు రక్షణ కరువైపోయింది.
సాక్షి, హైదరాబాద్: స్త్రీని దైవంగా కొలిచే మన దేశంలో మహిళలకు రక్షణ కరువైపోయింది. ఐటీ కార్యాల యాలు మొదలుకుని ఆస్పత్రుల దాకా.. కళాశా లలు, వర్సిటీల నుంచి కంపెనీల వరకూ అన్నిం టా మగువలకు వేధింపులే. పనిప్రదేశాల్లో 38 శాతం మంది వనితలు లైంగిక వేధింపులకు గుర వుతున్నారట. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు 69 శాతం మంది మహిళలు అసలు ముందుకే రావడం లేదట. ఇలాంటి పెడధోరణి పెరగడం సభ్యసమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దేశం లోని పలు ప్రధాన నగరాల్లో ఇటీవల ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ చేపట్టిన సర్వేలో తేలిన వాస్తవాలివీ.
	దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, జలంధర్, కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో, పుణే నగరాల్లో విభిన్న రంగాల్లో పనిచేస్తున్న 6,047 మంది తమ మనోగతాన్ని వెల్లడించారు. సర్వేలో 78 శాతం మంది మహిళలు, 22 శాతం మంది పురుషులతో పాటు 45 శాతం మంది బాధిత మహిళలు కూడా పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. సర్వేలో 38 శాతం మంది మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతు న్నట్టు చెప్పగా.. మరో 22 శాతం మంది పాఠశాలలు, కళాశాలల్లో వేధింపుల బారిన పడుతున్నట్టు వెల్లడించారు. మరో 40 శాతం మంది ఇతర ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు.
	
	ఫిర్యాదు చేయాలంటే భయమే..
	తమపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంలో 68.9 శాతం మంది మహిళలు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా బాస్‌లపై ఫిర్యాదు చేసేందుకు భయపడడం, పరువు పోతుందనే ఆందోళన, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పలు కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ విభాగం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. పనిప్రదేశాల్లో సహోద్యోగులు, బాస్‌లే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఈ సర్వేలో స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న 53 శాతం మంది తాము స్వయంగా వేధింపులకు గురైనట్లు తెలిపారు. మరో 47 శాతం మంది సామాజిక సైట్ల ద్వారా కూడా తాము వేధింపులకు గురవుతున్నట్లు స్పష్టంచేశారు.
	
	చట్టంపై అవగాహన శూన్యం..
	కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకువచ్చిన ‘పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం–2013’పై పలు సంస్థలకు అసలు అవగాహనే లేదని ఈ సర్వేలో తేటతెల్లమైంది. 65.2 శాతం కంపెనీలకు ఈ చట్టంపై అవగాహన లేదని, ఆయా కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ విభాగం లేదని తేలింది. ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి తమపై జరిగిన లైంగిక దాడులపై ఫిర్యాదు చేసినా విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని చాలా మంది తెలిపారు.
	
	పనిప్రదేశాల్లో 38% మంది మహిళలపై లైంగిక వేధింపులు
	► ఫిర్యాదు చేసేందుకు 69% మంది మహిళల వెనుకంజ
	► ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్  సర్వేలో వెల్లడి
	► ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో సర్వే
	
	చట్టం అమలయ్యేలా చూడాలి
	పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సమర్థంగా అమలు
	చేయాలి. అన్ని సంస్థలకు చట్టంపై అవగాహన కల్పించాలి. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార విభాగం ఉండాలి.  – ఉషానందిని, ప్రభుత్వ ఉద్యోగిని    
	
	ఫిర్యాదు చేసేవారికి మద్దతునివ్వాలి
	వేధింపులపై ఫిర్యాదు చేసే మహిళలకు సమాజంలో అన్ని వర్గాలు మద్దతివ్వాలి. సంఘ విద్రోహ శక్తులు, సమాజంలోని చీడపురుగులకు శిక్షలు పడేలా చూడాలి. వేధింపులకు పాల్పడేవారికి సామాజిక బహిష్కారం విధించాలి.  – కల్యాణి, పీహెచ్‌డీ స్కాలర్,జేఎన్ టీయూ
	
	వివిధ రంగాల్లో మహిళలపై వేధింపులిలా..
	45% ఐటీ, బీపీవో, కేపీవో సంస్థలు
	విద్యా రంగం   21.4%
	11.9%   వ్యవసాయం, ఆహార రంగాలు
	ఆస్పత్రులు, వైద్య రంగం  9.5%
	7.1%  న్యాయ విభాగం, ప్రభుత్వ విభాగాలు
	5.1%  ఉత్పత్తి, కంపెనీల రంగం
	
	వేధింపుల తీరిది..
	12.5%  లైంగిక దాడులు
	అసభ్యమైన కామెంట్స్  25%
	25%  అసభ్యంగా తాకడం  
	లైంగిక వాంఛ తీర్చమనడం  12.5%
	25% శారీరక వేధింపులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
