భార్యను, మరో వ్యక్తిని హత్య చేసిన భర్త | wife and paramour killed by husband in secunderabad | Sakshi
Sakshi News home page

భార్యను, మరో వ్యక్తిని హత్య చేసిన భర్త

Sep 13 2014 9:41 AM | Updated on Sep 29 2018 4:52 PM

భార్యను, మరో వ్యక్తిని హత్య చేసిన భర్త - Sakshi

భార్యను, మరో వ్యక్తిని హత్య చేసిన భర్త

సికింద్రాబాద్లో శనివారం జంట హత్యల కలకలం రేపింది. బోయిన్పల్లి శివాలయం వీధిలో కట్టుకున్న భార్యను, మరో వ్యక్తిని దారుణంగా హతమార్చాడో ఓ భర్త.

సికింద్రాబాద్‌లో జంటహత్యలు కలకలం సృష్టించాయి. కట్టుకున్న భార్యను, మరో వ్యక్తిని దారుణంగా హతమార్చాడో ఓ భర్త. ఈ ఘటన బోయిన్ పల్లి సమీపంలో చోటు చేసుకుంది. బోయిన్ పల్లికి చెందిన జయశ్రీ, రాకేష్‌లు 20 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల నుండి వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో..భార్య బోరబండలోని పుట్టింటికెళ్లింది.  

ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో భార్యను రాకేష్ బోయిన్ పల్లిలోని తన ఇంటికి తీసుకు వచ్చి... నల్ల పోచమ్మ గుడి వద్ద కత్తితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్యతో వివాహేతర  సంబంధం ఉందని బేగంపేటకు చెందిన నరేన్‌ అనే వ్యక్తిని  అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు రాకేష్ బోయిన్ పల్లి వెళ్లి పోలీసుకు లొంగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement