వరంగల్‌ విభజన ఎందుకు: కోదండరామ్ | what is the need to divide warangal district, asks kodandaram | Sakshi
Sakshi News home page

వరంగల్‌ విభజన ఎందుకు: కోదండరామ్

Aug 23 2016 1:58 PM | Updated on Jul 29 2019 2:51 PM

వరంగల్‌ విభజన ఎందుకు: కోదండరామ్ - Sakshi

వరంగల్‌ విభజన ఎందుకు: కోదండరామ్

కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు.

కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని కోరారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలపాలని ఆయన అన్నారు.

గద్వాల, జనగామ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ఇక మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందం మంచిదే గానీ, ఆ ఒప్పందం వివరాలేంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే... ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ డైరీలో ఉన్న వివరాలు అన్నింటినీ కూడా బయటపెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement