'ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవు' | We have not any conflicts with the government : Kodandaram | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవు'

Sep 11 2014 7:36 PM | Updated on Jul 29 2019 2:51 PM

కోదండరామ్ - Sakshi

కోదండరామ్

తెలంగాణా ప్రభుత్వం మూడునెలల పాలన సరైన మార్గంలోనే ఉందని తెలంగాణా జేఏసీ చైర్మన్‌ కోదండరామ్ అన్నారు.

హైదరాబాద్:  తెలంగాణా ప్రభుత్వం మూడునెలల పాలన సరైన మార్గంలోనే ఉందని తెలంగాణా జేఏసీ చైర్మన్‌ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ పనితీరుపై తాము సంతృప్తిగా ఉన్నామని స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పారు.

ఇక జేఏసీ స్థబ్దంగా ఉందని చెప్పడం సరికాదన్నారు.  పనితీరులో మాత్రమే మార్పు ఉందని  తెలిపారు. త్వరలో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర బడ్జెట్పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని  కోదండరాం చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement