డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ | two drugs suppliers arrested in jeedimetla | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

Dec 25 2016 5:44 PM | Updated on Aug 20 2018 4:27 PM

కుత్బుల్లాపూర్లోని జీడిమెట్లలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్:
నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 వేల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు రత్నగిరి, కిషోర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అమెరికా నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement