
టీవీ నటి అస్మితను వేధించిన యువకుల అరెస్టు
తెలుగు టీవీ నటిని వేధిస్తూ, ఆమె కారును ఫాలో చేసిన కేసులో ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు.
అస్మిత అనే తెలుగు టీవీ నటిని వేధిస్తూ, ఆమె కారును ఫాలో చేసిన కేసులో ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్రాన్ బిన్ మహ్మద్, సయ్యద్ నూరుల్లా హుస్సేని అనే ఇద్దరు ఆమె కారును ఓ బైకులో ఫాలో అవుతూ.. ఆమె దారిని అడ్డగించడమే కాక.. కారువైపు దూసుకొస్తూ, అసభ్యకరమైన చేష్టలు చేశారు.
అస్మిత వెంటనే వాళ్లిద్దరినీ ఫొటో తీసి, దాన్ని 'షీటీం' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అప్పటికే నగరంలో తిరుగుతూ ఉన్న షీ టీం సభ్యులు ఆ ఫొటో, బైకు ఆధారంగా వాళ్లను వెంటనే అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా తెలిపారు. వాళ్లిద్దరి మీద పెట్టీకేసు పెట్టి.. తర్వాత విడిచిపెట్టినట్లు ఆమె చెప్పారు.