'టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది' | TRS party overloaded says V Hanumantha rao | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది'

Feb 12 2016 7:22 PM | Updated on Sep 19 2019 8:28 PM

'టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది' - Sakshi

'టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది'

రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతల చేరికతో టీఆర్ఎస్ పార్టీ ఓవర్లోడ్ అయిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతల చేరికతో టీఆర్ఎస్ పార్టీ ఓవర్లోడ్ అయిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో వి.హనుమంతరావు మాట్లాడుతూ... టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నేతలను అక్కడ సెకండ్ సిటిజన్లుగానే పరిగణిస్తారన్నారు.

గౌరవం లేని చోటుకు ఎందుకు వెళ్లడమంటూ టీఆర్ఎస్ కండువా కప్పుకున్న టీడీపీ నేతలను వి.హనుమంతరావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని టీడీపీ నేతలకు వి.హనుమంతరావు ఉచిత సలహా ఇచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement