విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న అభ్యర్థులు మహాత్మ జ్యోతిబా పూలే (ఎంజేపీ) ఓవర్సీస్ విద్యానిధి
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న అభ్యర్థులు మహాత్మ జ్యోతిబా పూలే (ఎంజేపీ) ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల లోపు https://telanganaepass. cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలంది.
అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించొద్దని, వయసు జులై 1 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా టోఫెల్/ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ/ జీమ్యాట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుందని వివరించింది.