వైద్యం వికటించి చిన్నారి మృతి | The child died due to wrong treatment | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి

Jun 24 2016 12:29 PM | Updated on Sep 4 2018 5:21 PM

వైద్యం వికటించి చిన్నారి మృతి చెందడంతో.. బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వైద్యం వికటించి చిన్నారి మృతి చెందడంతో.. బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ చిన్నారి ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు దగ్గర్లొ ఉన్న దివ్య చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. వైద్యం వికటించడం వల్లే చిన్నారి మృతిచెందిందని ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చచెపుతున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement