ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను త్వరలోనే ఇక్కడికి రప్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను త్వరలోనే ఇక్కడికి రప్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో టీజీవో డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగుల హెల్త్ కార్డులపై కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులదే కీలక పాత్ర అని కేటీఆర్ గుర్తు చేశారు. అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.