
సా.4 గంటలకు తెలంగాణ డీజీపీ ప్రెస్ మీట్
తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ, సీఐడీ విచారణ వివరాలను ఆయన వెల్లడించనున్నారు. మరోవైపు ఎంసెట్ లీకేజీపై సీఐడీ సహా ఉన్నతాధికారులతో ఇవాళ ఉదయం డీజీపీ భేటీ అయ్యారు.
లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికిచ్చే నివేదికపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఎంసెట్-2 లీకేజీ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎంసెట్-2 పేపర్ లీక్ చేసిన నిషాద్ను పోలీసులు ముంబయిలో అరెస్ట్ చేశారు. అలాగే రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ నిర్వహకుడు వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు.