తెలంగాణలో దద్దమ్మ పాలన | Tammineni Veerabhadram fired on TRS government | Sakshi
Sakshi News home page

తెలంగాణలో దద్దమ్మ పాలన

Mar 5 2017 4:11 AM | Updated on Aug 21 2018 9:33 PM

తెలంగాణలో దద్దమ్మ పాలన - Sakshi

తెలంగాణలో దద్దమ్మ పాలన

తెలంగాణలో దద్దమ్మ పాల న కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

సర్కార్‌పై తమ్మినేని ధ్వజం   
మిర్యాలగూడ/వేములపల్లి: తెలంగాణలో దద్దమ్మ పాల న కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్ర శనివారం నల్లగొండ జిల్లా వేములపల్లి, మిర్యాలగూడలో సాగింది.  ఆ సభల్లో ఆయన మాట్లాడుతూ సర్కార్‌ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లో ‘పొలికేక’ పేరిట బహిరంగసభ నిర్వహి స్తున్నట్టు తమ్మినేని చెప్పారు.

ప్రధాని మోదీ నిర్ణయాలకు కేసీఆర్‌ వత్తాసు పలుకుతూ చిన్నమోదీల వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు. కేరళ సీఎం తలకే వెల కట్టిన ఆర్‌ ఎస్‌ఎస్‌ ప్రముఖున్ని అరెస్టు చేయకపోవడం దారుణమ న్నారు. కాగా, రైస్‌ మిల్లులను ఆదుకునేందుకు,  లక్షలాది మంది ఉపాధిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement