పాదయూత్రతో కేసీఆర్ కు బెదురు: తమ్మినేని | tammineni Veerabhadram fired on cm kcr | Sakshi
Sakshi News home page

పాదయూత్రతో కేసీఆర్ కు బెదురు: తమ్మినేని

Oct 26 2016 3:11 AM | Updated on Aug 14 2018 10:54 AM

పాదయూత్రతో కేసీఆర్ కు బెదురు: తమ్మినేని - Sakshi

పాదయూత్రతో కేసీఆర్ కు బెదురు: తమ్మినేని

‘మహాజన పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు బెదురు పుట్టింది.

కందుకూరు: ‘మహాజన పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు బెదురు పుట్టింది. అందుకే పాదయాత్ర మొదలైన ఈ 8 రోజుల్లో 8 వరాలు ప్రకటించారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాదయాత్ర కొనసాగితే ఐదు నెలలు ప్రభుత్వం అల్లాడి పోవాల్సిందేనన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, గూడూరు, కందుకూరు చౌరస్తా, దెబ్బగూడ, నేదునూరు గ్రామాలలో ఆయన పాదయాత్ర చేశారు.

దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటివాటిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల జేబులు నింపడానికే పథకాలను వాడుకుంటున్నారన్నారు. అగ్రకులాల ఆధిపత్యం తొలగి సామాజిక న్యాయం జరగాలనే అజెండాతో వెళ్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మంత్రి కేటీఆర్ ఆర్భాటంగా మొదలుపెట్టిన మైక్రోమ్యాక్స్ కంపెనీలో స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 1,000 మందికి ఉపాధి లభిస్తుందన్న నాటి మాటలు నీటి మూటలయ్యాయన్నారు. ఇప్పటికైనా స్థానిక యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement