
రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని
భూ కుంభకోణాల్లో సబ్ రిజిస్ట్రార్లపై చర్యలకే పరిమితం కాకుండా, రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్న తాధికారులను బాధ్యతల నుంచి తప్పిం చాలని సీపీఎం డిమాండ్ చేసింది.
ఒకవైపు మియాపూర్ భూకుంభకోణంలో స్వయంగా ఓఎస్‌డీ ప్రత్యక్షపాత్రే ఉందని ప్రభుత్వమే చెబుతూ మరోవైపు సంబంధిత మంత్రికి ఏ సంబంధం లేదనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే సర్కార్ చోద్యం చూస్తోందన్నారు.