సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి | Tammineni veerabadram about cm KCR | Sakshi
Sakshi News home page

సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి

Jan 11 2017 3:47 AM | Updated on Aug 15 2018 9:37 PM

సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి - Sakshi

సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి

సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మరిపెడ: సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఆనేపురం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ పేదల పక్షం అని చెబుతున్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచారన్నారు.

దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నాడని ఆరోపించారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇస్తానన్న మాటే గాని ఎక్కడా అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు విషయంలో కేంద్రానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా నాయకులు, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement