ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
- తీవ్రంగా గాయపడ్డ మూడేళ్ల చిన్నారి
నల్లకుంట
వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన ఉప్పల్ కళ్యాణ పురి కాలనీ లో జరిగింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. గుంపుగా తిరుగుతున్న వీధి కుక్కలు బుధవారం ఒక్కసారి గా ఇంట్లో కి వచ్చి.. ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి పావని(3) ని నోట కర్చుకుని ఈడ్చుకు వెళ్లాయి.
చిన్నారి తల, ముఖం, కడుపు, వీపు, చేతులపై తీవ్ర గాయాలు చేశాయి. ఇంతలో దాడిని గమనించిన స్థానికులు కుక్కలను తరిమి.. చిన్నారిని కాపాడారు. రక్తం ఓడుతున్న చిన్నారిని హుటాహుటిన నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.