బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్ | somesh kumar take charges tribal welfare principal secretary | Sakshi
Sakshi News home page

బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్

Oct 31 2015 1:02 PM | Updated on Sep 3 2017 11:47 AM

బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్

బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్

జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని  ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా సోమేష్కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమేష్కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సాధారణమని ఆయన పేర్కొన్నారు.

గతంలో గిరిజన శాఖలో పని చేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. గిరిజన శాఖలో మరింత బాగా పని చేస్తానని సోమేష్కుమార్ చెప్పారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతల నుంచి సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా బి.జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement