పాముతో 40 నిమిషాలు ! | snake hang on a women Leg in Brahmanapalli | Sakshi
Sakshi News home page

పాముతో 40 నిమిషాలు !

Aug 20 2014 9:31 AM | Updated on Sep 2 2017 12:10 PM

పాముతో 40 నిమిషాలు !

పాముతో 40 నిమిషాలు !

ఒకటి..రెండు కాదు ఏకంగా నలభై నిమిషాలు ఓ విషసర్పం వృద్ధురాలి కాలిని చుట్టుకుంది. అది ఎక్కడ కాటు వేస్తుందోనని ఆమె వణికిపోయింది.

హైదరాబాద్ : ఒకటి..రెండు కాదు ఏకంగా నలభై నిమిషాలు ఓ విషసర్పం వృద్ధురాలి కాలిని చుట్టుకుంది. అది ఎక్కడ కాటు వేస్తుందోనని ఆమె వణికిపోయింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన మంగళవారం హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వృద్ధురాలు  కొండ్రు బాలమ్మ (91) ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఉంది. చెట్ల పొదల నుంచి వచ్చిన తాచుపాము ఆమె కాలుకు చుట్టుకుంది. దీంతో ఆమె భయంతో వణికిపోయింది. సుమారు 40 నిముషాల పాటు ఆమె కాలుకు పాము చుట్టుకుని ఉంది. దీన్ని గమనించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చెందారు. కాటు వేయకుండా పాము వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  హయత్‌నగర్ 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బాలమ్మకు ప్రథమ చికిత్స అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement