బాబాయ్ జంప్... అబ్బాయ్ షాక్! | Shock in TDP | Sakshi
Sakshi News home page

బాబాయ్ జంప్... అబ్బాయ్ షాక్!

Jan 12 2016 3:32 AM | Updated on Sep 3 2017 3:29 PM

బాబాయ్ జంప్... అబ్బాయ్ షాక్!

బాబాయ్ జంప్... అబ్బాయ్ షాక్!

టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద్‌కు బాబాయ్ కె.ఎం.గౌరీష్ ఝలక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే పార్టీ మార్చేశారు.

కుత్బుల్లాపూర్: టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద్‌కు బాబాయ్ కె.ఎం.గౌరీష్ ఝలక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే పార్టీ మార్చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లితో మంతనాలు జరిపి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు. కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కుత్బుల్లాపూర్‌లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. గౌరీష్ రెండో అన్న ప్రతాప్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరగా... తమ్ముడు అదే బాట పట్టాడు.

గౌరీష్ సతీమణి పారిజాతకు కుత్బుల్లాపూర్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. మరో ఇద్దరు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ   నేతలు బుధవారం కేటీఆర్, మహేందర్‌రెడ్డి, తలసాని సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement