నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు.. | shabbir ali takes on kcr and palvai govardhan reddy | Sakshi
Sakshi News home page

నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు..

Jun 9 2016 2:06 PM | Updated on Sep 4 2017 2:05 AM

నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు..

నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు..

కాంగ్రెస్‌ ఓటమికి ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు.

కాం‍గ్రెస్‌ ఓటమికి పాల్వాయి వంటి నేతలే కారణం
మండలి ప్రతిపక్ష నేత షబ్బిర్‌ అలీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఓటమికి ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో  షబ్బీర్ అలీ మాట్లాడుతూ... సీఎల్పీ నేత జానారెడ్డిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలను షబ్బీర్ అలీ ఖండించారు. జానారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన పాల్వాయికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన కోరారు.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, కూలీల వలసలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ స్కీమ్‌ను సైతం కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వంపై తాము రెండేళ్లుగా చెబుతున్న అంశాలే జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ లేవనెత్తారని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో కోదండరాంను విమర్శించినందుకు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నాలుక కోస్తా అన్న కెసీఆర్.. ఇప్పుడు తెలంగాణ మంత్రులు కోదండరాం పై చేసిన దాడిని ఏ విధంగా స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులకు ఏ శిక్షలు విధిస్తారని కేసీఆర్ను ఆయన నిలదీశారు. ఈ అంశంపై కేసీఆర్‌ స్పందించకపోతే ఆయన ఆదేశాలతోనే మంత్రులు కోదండరామ్ను టార్గెట్ చేశారని భావించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement