‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం | 'Sakshi' Property Show was started | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం

Sep 3 2017 12:29 PM | Updated on Sep 17 2017 6:18 PM

‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం

‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం

నగరవాసులు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి వేదికయింది.

- సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం
35 స్టాళ్లు ఏర్పాటు
 
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నగరవాసులు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ‘సాక్షి’ ప్రాపర్టీ షో మరోసారి వేదికయింది. హైదరాబాద్‌ నలువైపులా నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ గృహాల వివరాలను తెలుసు కునేందుకు వచ్చిన సందర్శకులతో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక ప్రాంగణం కిటకిటలాడింది. శనివారం ఘనంగా ప్రారంభమైన మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్‌కు చెందిన 25 ప్రముఖ నిర్మాణ సంస్థలు, 35 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఉదయం 10 నుంచే సందర్శకులు రావడం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, జనరల్‌ సెక్రటరీ చెరుకు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలను ఒకే గొడుకు కిందికి తీసుకు రావటం నిర్మాణ సంస్థలకు ఎంత ఉపయుక్తమో.. సందర్శకులకూ అంతేనన్నారు. స్థిరాస్తిపై సందేహాలను నివృత్తి చేసుకోవటంతో పాటు ఒక ప్రాంతంలోని ధరలను ఒకే వేదికపై సరిపోల్చుకునే వీలుంటుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని ఏడాదికి రెండు సార్లు కల్పిస్తున్న సాక్షిని అభినందించారు. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో నిర్మాణ రంగంలో పార దర్శకత నెలకొంటోందని.. సీరియస్‌ కొనుగోలు దారులు, విదేశీ, ప్రవాస ఇన్వెస్టర్లు  కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.


ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థలాల ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. నివాస సముదాయాలతో పాటు వాణిజ్య, కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరుగుతోందని, ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకోవటానికి స్థానిక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్, జనరల్‌ మేనేజర్‌ రమణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 




 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement