డబ్బులు డ్రా చేస్తానని చెప్పి.. బురిడీ! | RTC driver cheated by unknown person with ATM card | Sakshi
Sakshi News home page

డబ్బులు డ్రా చేస్తానని చెప్పి.. బురిడీ!

Feb 24 2017 7:53 PM | Updated on Sep 5 2017 4:30 AM

ఏటీఎంలో డబ్బులు తీసేందుకు సాయం చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది.

హైదరాబాద్: ఏటీఎంలో డబ్బులు తీసేందుకు సాయం చేస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాతవాహననగర్‌కు చెందిన మండ జయశంకర్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతవారం ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఎల్‌బీనగర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఎస్‌బీహెచ్‌ ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు.

అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో నుంచి డబ్బులు తీసేందుకు సహాయ పడతానని చెప్పి ఏటీఎం కార్డు తీసుకుని రూ.20,800లను తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఫోన్‌కు సమాచారం రావడంతో మోసపోయినట్లు గుర్తించిన జయశంకర్‌ ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement