గోదాంలో రూ. 61.6 లక్షల పాత కరెన్సీ స్వాధీనం | Rs. 61.6 lakh old currency possession in the warehouse | Sakshi
Sakshi News home page

గోదాంలో రూ. 61.6 లక్షల పాత కరెన్సీ స్వాధీనం

Apr 26 2017 3:22 AM | Updated on Sep 5 2017 9:40 AM

గోదాంలో రూ. 61.6 లక్షల పాత కరెన్సీ స్వాధీనం

గోదాంలో రూ. 61.6 లక్షల పాత కరెన్సీ స్వాధీనం

ఒక గోదాంలో అక్రమంగా దాచి ఉంచిన రూ.61.60 లక్షల పాత కరెన్సీని హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌: ఒక గోదాంలో అక్రమంగా దాచి ఉంచిన రూ.61.60 లక్షల పాత కరెన్సీని హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పోర్ట్స్‌ కిట్స్‌ పేరిట హనుమాన్‌టేకిడీలో అహ్మద్‌ అనే వ్యక్తి ఒక గోదాంను అద్దెకు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విశ్వనీయ సమాచారం మేరకు సుల్తాన్‌బజార్‌ పోలీసులు గోదాంపై దాడిచేశారు.

అందులో ఉన్న  రూ.61.60 లక్షల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు లక్షల రూపాయల పాత కరెన్సీ అహ్మద్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement