చిట్టీల పేరుతో రూ.50 లక్షలు కుచ్చుటోపీ | Rs 50 lakh fraud in the name of chit | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ.50 లక్షలు కుచ్చుటోపీ

Dec 20 2015 10:00 AM | Updated on Sep 4 2018 5:07 PM

చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.50 లక్షల వరకు టోకరా వేశాడు.

చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.50 లక్షల వరకు టోకరా వేశాడు. బాధితులు శనివారం హయత్ నగర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ డివిజన్‌లోని పద్మావతికాలనీలో నివసించే అంజిరెడ్డి గత పదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా చిట్టీ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు.

శనివారం ఉదయం బాధితులు అంజిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను నిలదీసి గొడవపడ్డారు. తాను చిట్టీలలో నష్టపోయానని బుకాయించడంతో బాధితులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 25 మంది బాధితులకు రూ.50 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని ఈ మేరకు అంజిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా డబ్బుల కోసం అంజిరెడ్డి ఇంటికి వెళ్లిన బాధితులు అతనిపై దాడి చేయగా అంజిరెడ్డి వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement