మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభం రోజున తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేయాలని మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ప్రారంభం రోజున తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేయాలని మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అన్నారు.
వచ్చే నెల (ఆగస్టు) 7న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రధానిని ఆకర్షించేలా ఏర్పాట్లు ఉండాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని వారికి సూచించారు.