రేపు రెడ్డి మహాగర్జన | reddy maha garjana at medchal | Sakshi
Sakshi News home page

రేపు రెడ్డి మహాగర్జన

May 13 2017 3:43 AM | Updated on Sep 5 2017 11:00 AM

మేడ్చల్‌ చెక్‌పోస్టు సమీపంలో ‘రెడ్డి మహాగర్జన’ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు

విజయవంతం చేయాలని జి.కరుణాకర్‌రెడ్డి పిలుపు
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్‌లోని మేడ్చల్‌ చెక్‌పోస్టు సమీపంలో ‘రెడ్డి మహాగర్జన’ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెడ్డి సంఘాల ప్రతినిధులు శుక్ర వారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమై గర్జన ఏర్పాట్లను సమీక్షించారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలకతీతంగా రెడ్ల అభివృద్ధి, వారి సంక్షేమం, ఐక్యత ధ్యేయంగా నిర్వహించే ఈ రెడ్డి మహాగర్జన చరిత్రలో నిలిచిపోతుందని జాతీయ రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఏపీలతోపాటు పలు రాష్ట్రాల్లో నివసిస్తున్న రెడ్డి సామాజిక వర్గ ప్రతినిధులను మహాగర్జనకు ఆహ్వానించామన్నారు. ఈ సభను విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement