ఓయూ బాలికల హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం | ragging at OU campus in hyderabad | Sakshi
Sakshi News home page

ఓయూ బాలికల హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం

Nov 8 2015 11:53 PM | Updated on Jul 31 2018 4:48 PM

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్ ఇంజినీరింగ్ విభాగం బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థినిని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు సమాచారం.

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్ ఇంజినీరింగ్ విభాగం బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థినిని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు సమాచారం. ఆదివారం హాస్టల్ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని తనను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని ఆవేదన చెందినట్టు వదంతలు రావడంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి.

పీడీఎస్‌యూ నాయకురాలు కావేరి, ఏబీవీపీ నగర ఇంచార్జ్ షాజాది హాస్టల్‌ను సందర్శించి ర్యాగింగ్ పై విద్యార్థినులను ఆరా తీశారు. హాస్టల్‌లో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు అంటున్నారు. మరోవైపు ర్యాగింగ్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement