ప్రభుత్వం తప్పును సరిచేసుకోవాలి : కోదండరామ్ | prof kodandaram fires on telangana govt over jayashankar Memorial | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం తప్పును సరిచేసుకోవాలి : కోదండరామ్

Jun 23 2016 2:14 PM | Updated on Sep 4 2017 3:13 AM

ప్రభుత్వం తప్పును సరిచేసుకోవాలి : కోదండరామ్

ప్రభుత్వం తప్పును సరిచేసుకోవాలి : కోదండరామ్

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ... ప్రొ.జయశంకర్ వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు.

వచ్చే ఏడాదైనా ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసుకోవాలని కోదండరామ్ సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement